e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home నిజామాబాద్ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలి

లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలి

లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలి

కోటగిరి, మే 13: ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని రుద్రూర్‌ సీఐ అశోక్‌రెడ్డి సూచించారు. ఎవరై నా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని పొతంగల్‌ సమీపంలో మంజీరా నది వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. 10 గంటల తర్వాత కూడా వాహనదారులు రోడ్లపై తిరగడంతో మందలించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడానికి ప్రణాళిక ప్రకారం బందోబస్తు సిబ్బందిని ఏర్పాటు నియమించామన్నారు.

వర్నిలో..
వర్ని, మే 13: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లోనూ లాక్‌ డౌన్‌ అమలును రుద్రూరు సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

ఇందల్వాయిలో..
ఇందల్వాయి, మే 13: మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ కొనసా గుతోంది. లాక్‌డౌన్‌ అమలు తీరును ఎస్సై శివప్రసాద్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమకు సహకరించాలని ఎస్సై కోరారు.

ఎడపల్లిలో..
ఎడపల్లి (శక్కర్‌నగర్‌), మే 13: ఎడపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ఎడపల్లి లో రద్దీగా ఉండే నయాబాది ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.

ఆర్మూర్‌లో..
ఆర్మూర్‌, మే 13 : ఆర్మూర్‌ మండలంలోని ఆలూర్‌ గ్రామం లో లాక్‌డౌన్‌ను పోలీసులు పర్యవేక్షించారు. ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సైదేశ్వర్‌, ఆలూర్‌ గ్రామ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతోపాటు ఇతర పార్టీల నాయకులతో మాట్లాడి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో ఎస్‌హెచ్‌వో వీడియో కాల్‌లో మాట్లాడి ఆలూర్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ గురించి వివరించారు. ఆర్మూర్‌ వైస్‌ ఎంపీపీ మోతె భోజకళాచిన్నారెడ్డి, ఆలూర్‌ సర్పంచ్‌ కల్లెం మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ మార్కంటి లక్ష్మీమల్లేశ్‌, ఆలూర్‌ సొసైటీ చైర్మన్‌ కల్లెం భోజారెడ్డి, ఉపసర్పంచ్‌ దుమ్మాజీ శ్రీనివాస్‌, ఎస్సైలు యాదగిరిగౌడ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

నవీపేటలో..
నవీపేట, మే 13: మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతున్నది. ఎస్సై యాకుబ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంతోపాటు జన్నేపల్లి, ఫకీరాబాద్‌ తదితర గ్రామాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్నది. రోడ్లపైకి ఎవరూ రాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఆయా గ్రామాల ప్రజలు సహకరిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

రెంజల్‌లో..
రెంజల్‌, మే 13: మండలంలోని కందకుర్తి గ్రామ శివారులో ఉన్న చెక్‌పోస్టు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. లాక్‌ డౌన్‌ విధించిన నేపథ్యంలో బ్యాంక్‌ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేయడంతో భౌతిక దూరం పాటిస్తూ జనం లావాదేవీలు జరిపారు. జనం, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా కనిపించే కందకుర్తి అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టు రోడ్డు మార్గం, తెలంగాణ చౌరస్తా , లాక్‌డౌన్‌ కారణంగా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రెంజల్‌ తహసీల్దార్‌ రాంచందర్‌, ఎస్సై మురళి చెక్‌ పోస్టును తనిఖీ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలి

ట్రెండింగ్‌

Advertisement