e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home కామారెడ్డి చివరి రోజూ అదే ఉత్సాహం..

చివరి రోజూ అదే ఉత్సాహం..

చివరి రోజూ అదే ఉత్సాహం..


డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి, సాంపల్లి తండాల్లో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ చురుగ్గా సాగుతోంది. రోడ్లకు ఇరువైపులా వివిధ రకాల మొక్కలునాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో మర్రి సురేందర్‌, ఎంపీవో రామకృష్ణ మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఘన్‌పూర్‌లోని ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ ఆధ్వర్యం లో మొక్కలు నాటారు. పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. సొసైటీ డైరరెక్టర్‌ సతీశ్‌రెడ్డి, నాయకులు కిశోర్‌, గడ్డం గంగాధర్‌, రాజుల సాయిలు, నడ్పి రాజేశ్వర్‌, కిషన్‌, బండి రవీందర్‌, సాయిలు, బండి సాయిలు పాల్గొన్నారు.

ధర్పల్లి మండలంలోని 22 గ్రామాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు ఆర్మూర్‌ పెద్దబాల్‌రాజ్‌, కొండ చంద్రశేఖర్‌, ధర్మానాయక్‌, భగవంత్‌రెడ్డి, భాగవ్వ, సంగీతాభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి బస్టాండ్‌ ఆవరణంలో ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, ఆర్టీసీ డిపో-1 మేనేజర్‌ ఆంజనేయులు మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సర్పంచ్‌ ఆర్మూర్‌ పెద్ద బాల్‌రాజ్‌, సొసైటీ చైర్మన్‌ చెలిమెల చిన్నారెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్‌ సబ్బని గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతిని నిరంతరం కొనసాగిస్తామని చందూర్‌ మండలం లక్ష్మాపూర్‌ సర్పంచ్‌ బొడ్డోళ్ల సత్యనారాయణ అన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను జేసీబీ సహాయంతో కూల్చివేయించారు. కోటగిరి మండలం హంగర్గాలో వ్యవసాయమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నీరడి గంగాధర్‌ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. సర్పంచ్‌ సునీతా విజయ్‌పటేల్‌, హెచ్‌ఎం పుల్లెల వెంకటరమణ, కార్యదర్శి మంచిర్యాల కవిత, అంగన్‌వాడీ టీచర్లు దోంతుల స్వరూప, శారద, ఉపాధ్యాయులు సురేశ్‌, సూదం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

జక్రాన్‌పల్లిలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఎంపీపీ డీకొండ హరిత జడ్పీటీసీ తనూజారెడ్డితోకలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రకళ, ఉప సర్పంచ్‌ బాలకిషన్‌, ఎంపీటీసీ-1,2 సభ్యులు గంగారెడ్డి, మరియా సతీశ్‌, ఎంపీడీవో లక్ష్మణ్‌, ఎస్సై సాయారెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యుడు డీకొండ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, ఏపీవో రవి తదితరులు పాల్గొన్నారు. పల్లెప్రగతిలో భాగంగా జక్రాన్‌పల్లిలో నాటిన మొక్కలను డీపీవో జయసుధ పరిశీలించారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనుల వివరాలను ఎంపీడీవో లక్ష్మణ్‌ను అడిగి తెలుసుకున్నారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాల న్నారు. డీపీవో వెంట ఎంపీవో యూసఫ్‌, ఏపీవో రవి, కార్యదర్శి నరేశ్‌, ఉప సర్పంచ్‌ బాలకిషన్‌ తదితరులు ఉన్నారు. చందూర్‌ మండల కేంద్రంలోని ఖాళీ ప్రదేశాల్లో ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలు మొక్కలు నాటారు. సర్పంచ్‌ కర్లం సాయారెడ్డి గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలం గుండారంలో ప్రజాప్రతినిధులతో కలిసి నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి మొక్కలు నాటారు.

జడ్పీటీసీ బొల్లెంక సుమలత, సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, ఎంపీటీసీ గంగాధర్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి, సొసైటీ చైర్మన్‌ దాసరి శ్రీధర్‌, నుడా డైరెక్టర్లు పాల్గొన్నారు.
మోపాల్‌ మండలం మంచిప్ప గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం, రసాయనాల పిచికారీ కోసం రూ.6.22 లక్షలు వెచ్చించి ప్రత్యేక వాహనాన్ని కొనుగోలు చేశారు. వాహనాన్ని సర్పంచ్‌ సిద్ధార్థ ప్రారంభించారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్‌ గ్రామ పాఠశాల ఆవరణలో ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పలు రకాల మొక్కలు నాటారు. నెహ్రూనగర్‌లో సర్పంచ్‌ అమానుల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కుర్నాపల్లిలో సర్పంచ్‌ సావిత్రి, ఎంపీటీసీ రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌ నాయక్‌ మొక్కలు నాటారు. ఎంపీడీవో శంకర్‌, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీఎం గంగారాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్‌ మండలం సాలూరాలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో డీసీసీబీ డైరెక్టర్‌ శరత్‌, ఎంపీపీ బుద్దె సావిత్రి మొక్కలను నాటారు.

సర్పంచ్‌ చంద్రకళ, ఎంపీటీసీ సవిత, రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్‌ బుద్దె రాజేశ్వర్‌, సొసైటీ చైర్మన్‌ శివకాంత్‌పటేల్‌, సొసైటీ కార్యదర్శి బస్వంత్‌ రావ్‌పటేల్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు. రెంజల్‌లోని వ్యవసాయ మార్కెటింగ్‌ గోదాం ఆవరణలో బోధన్‌ వ్యవసాయ మార్కె ట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అర్చన మొక్కలను నాటారు. రెంజల్‌లో ఇంటింటికీ ఆరు మొక్కలను సర్పంచ్‌ రమేశ్‌కుమార్‌ పంపిణీ చేశారు. ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ లతీఫ్‌, డైరెక్టర్‌ యాస్మిన్‌బేగం, టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకుడు రఫీక్‌, జాగృతి మండల కన్వీనర్‌ నీరడి రమేశ్‌, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి మెర్సీ, సిబ్బంది గంగారెడ్డి, లింగం, నవీన్‌ పాల్గొన్నారు. ఆర్మూర్‌ మండలం చేపూర్‌లో ఉన్న సొసైటీ గోదాం వద్ద సర్పంచ్‌ సాయన్న, చైర్మన్‌ భోజారెడ్డి, సొసైటీ డైరెక్టర్‌ ఏలియారెడ్డి, సొసైటీ సీఈవో మొహీనొద్దీన్‌ మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఆలూర్‌లో పల్లెప్రగతి పనులను డీఎల్‌పీవో శ్రీనివాస్‌ పరిశీలించి సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, కార్యదర్శుల కు పలు సూచనలు చేశారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్‌లో కో-ఆపరేటివ్‌ సొసైటీ ప్రాంగణంలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఎంపీడీవో గోపీబాబు, ఎంపీవో నాగేంద్రప్ప ఉన్నారు.

‘పల్లెప్రగతి’ పనులపై రెండు రోజుల్లో నివేదికను అందజేయా లని నవీపేట ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. పల్లెప్రగతి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఎంపీడీవో సయ్యద్‌ సాజిద్‌ అలీ, ఎంపీవో రాజ్‌కాంత్‌రావు, ఆయా గ్రామాలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు. మోర్తాడ్‌లో ఇంటింటికీ ఆరు మొక్కలను అంగన్‌వాడీ టీచర్లు పంపిణీ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చివరి రోజూ అదే ఉత్సాహం..
చివరి రోజూ అదే ఉత్సాహం..
చివరి రోజూ అదే ఉత్సాహం..

ట్రెండింగ్‌

Advertisement