అబద్ధాల హస్తం పార్టీకి బుద్ధి చెప్పాలి
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
- మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
- హామీలను తుంగులోకి తొక్కిన రేవంత్ సర్కార్
- కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది..
- కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎన్నడూ కరువు లేదు..
కోటగిరి/ వర్ని/మోస్రా(చందూర్)/ నస్రుల్లాబాద్, మే 10: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ కరువు రాలేదన్నారు. కాంగ్రెస్ వచ్చి కరువు, కష్టాలు తెచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మోస్రా మం డల కేంద్రంతోపాటు పొతంగల్ మండలం కొడిచెర్ల, హంగర్గా, వర్ని మండలం హుమ్నాపూర్, నెహ్రూనగర్, బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామాల్లో జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే విద్యుత్, తాగునీటి కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలను నిలిపివేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీ ఇచ్చి, ఒక్క గ్యారంటీని కూడా అమలుచేయలేదని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహిళలకు నెలకు రూ.2500 ఇస్తున్నారంటూ అవగాహన లేకుండా మాట్లాడారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆ పథకం అమలుకు నోచుకోలేదని అన్నారు. హామీలతో నమ్మించి గెలిచిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీలు శంకర్‌పటేల్, బర్దావల్ హరిదాస్, నారోజీ గంగారాం, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్లు హమీద్, నీరడి గంగాధర్, మల్లేశ్, మున్నీ, వెంకట్‌రెడ్డి, నీరడి ఉదయ్, కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్, లీలా శంకర్, కనకారెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

