నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 7 : మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు సైతం లేక అవస్థలు పడ్డారు. గతుకుల రోడ్లపై రాకపోకలు సాగిస్తూ కాలం వెల్లదీశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతితో ఆ గ్రామం దశ మారిపోయింది. ప్రస్తుతం అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తున్నది నిజామాబాద్ మండలం ఆకుల కొండూరు గ్రామం. మైనర్ పం చాయతీగా ఉన్న ఈ గ్రామం కింద అశోక్ఫారం, శాంతినగర్ అనుబంధ గ్రామాలు ఉన్నాయి. పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామశివారులో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ముళ్ల చెట్లు, గుంతలమయంగా ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి మొరం వేసి చదును చేశారు. రాజమండ్రిలోని కడియం నర్సరీ నుంచి వివిధ రకాల అందమైన మొక్కలను తెచ్చి పల్లెప్రకృతి వనంలో నాటారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లక్ష రూపాయలు విరాళం అందించగా పల్లెప్రకృతి వనంలో 12 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు సైతం అభివృద్ధికి విరాళాలు అందించారు. గ్రామంలో కిలోమీటర్ పొడవునా ప్రధాన రోడ్డుకిరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. ఏడేండ్ల నుంచి వందశాతం ఇంటి పన్ను వసూలు చేసి గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామస్తులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్న ఫలితంగానే ఇంటి పన్ను చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఫలితంగా ఉత్త మ గ్రామపంచాయతీ అవార్డును అందుకున్నారు. గ్రామంలో ప చ్చదనంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారు. వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం పనులన్నీ స్వల్పకాలంలోనే పూర్తి చేశారు.
పుష్కలంగా నిధులు..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. గ్రామాన్ని అభివృ ద్ధి పథంలో నడిపిస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలిపేందు కు కృషి చేస్తా. గ్రామాభివృద్ధికి సహకారమందిస్తున్న ఎమ్మెల్యేకు, వాయుపుత్ర యువజన సం ఘం సభ్యులకు, వీడీసీ సభ్యులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
-మెట్టు అశోక్, సర్పంచ్
ఇవీ కూడా చదవండీ…
రాష్ట్ర సరిహద్దులోనే కరోనా పరీక్షలు