e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 11, 2021
Advertisement
Home నిజామాబాద్ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

డిచ్‌పల్లి/ఇందల్వాయి/ధర్పల్లి/వర్ని/మోర్తాడ్‌/ఏర్గట్ల/ఎడపల్లి (శక్కర్‌నగర్‌)/నందిపేట/రెంజల్‌, ఏప్రిల్‌ 7: ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ సూచించారు. డిచ్‌పల్లి మండలం మెం ట్రాజ్‌పల్లి సహకార సంఘం పరిధిలోని సాంపల్లి గ్రామం లో కొనుగోలు కేంద్రాన్ని వారు బుధవారం ప్రారంభించారు. దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షులు కృష్ణ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, డిచ్‌పల్లి సొసైటీ చైర్మన్‌ జైపాల్‌, వైస్‌చైర్మన్‌ నవీన్‌, సర్పంచులు జగదీశ్‌, గణేశ్‌, రఘు, ఎంపీటీసీ బిక్యా, ఉపసర్పంచులు మో హన్‌, రాజలింగం, ఏలేందర్‌, సీఈవో ప్రకాశ్‌ జోషి పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి, అన్సాన్‌పల్లి, స్టేషన్‌ తండా, గౌరారం, జీకే తండా గ్రామాల్లో ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహ న్‌, జడ్పీటీసీ జగన్‌ ప్రారంభించారు. వైస్‌ ఎంపీపీ అంజ య్య, సొసైటీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

ధర్పల్లి మం డలం హోన్నాజీపేట్‌ గ్రామంలో జడ్పీటీసీ జగన్‌ ఎంపీపీ నల్లసారికతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, మండల కన్వీనర్‌ రాజ్‌పాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, ధర్పల్లి సొసైటీ చైర్మన్‌ చిన్నారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్‌ కిశోర్‌రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి, మద్దుల్‌ తండా సర్పంచ్‌ దేవేందర్‌, సొసైటీ కా ర్యదర్శి గంగనర్సయ్య, రైతులు, నాయకులు పాల్గొన్నారు. వర్ని మం డలం జాకోరా, జలాల్‌పూర్‌ గ్రామాల్లో జాకోరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వర్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు బందెల సంజీవులు అన్నారు. మోర్తాడ్‌, వడ్యాట్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ రవి సొసైటీ చైర్మన్‌ అశోక్‌ ప్రారంభించారు.

తహసీల్దార్‌ శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఏలియా, సర్పంచులు ధరణి, రూప, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ పాపాయి పవన్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ పర్సదేవన్న, సొసైటీ ఉపాధ్యక్షుడు నవీన్‌, ఎంపీటీసీలు రాజ్‌పాల్‌, కళావతి, డీసీసీబీ డైరెక్టర్‌ భూమన్న, ఆనంద్‌, గంగారెడ్డి, సతీశ్‌, రాజేశ్వర్‌ పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంతోపాటు బట్టాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్‌, సొసైటీ చైర్మన్‌ నర్సయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం తెలిపారు. ఏర్గట్లలోని అయ్యప్ప ఆలయం వద్ద కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయాధికారి మహ్మద్‌ అబ్దుల్‌ మాలిక్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ అంజయ్య, సొసైటీ మాజీ చైర్మన్‌ లింగారెడ్డి, సొసైటీ వైస్‌ చైర్మన్‌ గంగారాం పాల్గొన్నారు.

ఎడపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఎడపల్లి, దుబ్బాతండా, ఒడ్డాపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌ ప్రారంభించారు. అంబం(వై)లో బోధన్‌ ఏఎంసీ ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ అర్చన, జైతాపూర్‌లో సింగిల్‌విండో అధ్యక్షుడు నారాయణ కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్‌, సింగిల్‌ విం డో అధ్యక్షుడు మల్కారెడ్డి, ఎంపీటీసీలు స్రవంతి, మనీషారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుభాష్‌, కార్యదర్శి రాజారాం, జైతాపూర్‌లో సింగిల్‌విండో అధ్యక్షుడు నారాయ ణ, ఏఎంసీ డైరెక్టర్‌ సత్యనారాయణ, ఠాణాకలాన్‌ సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. నందిపేట్‌ మండలం తల్వేదలో చింరాజ్‌పల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్‌ గంగారెడ్డి ప్రారంభించారు. వైస్‌ చైర్మన్‌ నర్సయ్య, డైరెక్టర్లు, కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. రెంజల్‌ మండలం దూపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రజినితో కలిసి విండో చైర్మన్‌ భూమారెడ్డి ప్రారంభించారు.

ఇవీ కూడా చదవండీ…

7 సార్లు గెలిచినా.. తాగునీరివ్వలేదు

వ్యాక్సినేషన్‌ను నిర్లక్ష్యం చేయొద్దు

నేటి నుంచి చతుర్వేద సదస్సు..!

ఆకుల కొండూర్‌.. ప్రగతి సూపర్

Advertisement
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement