లింగంపేట/రుద్రూర్/నాగిరెడ్డిపేట/ ధర్పల్లి/ ఇందల్వాయి, అక్టోబర్ 28: ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళ వారం భారీ వర్షం కురిసింది. లింగంపేట, నాగిరెడ్డిపేట, రుద్రూర్, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృ తమవగా మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి పోయిం ది. రుద్రూర్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి కాంటా చేసి ఉంచిన ధాన్యం బస్తాలూ పూర్తిగా తడిసిముద్దయిపోయాయి.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యం తేమశాతం లేకుండా చూడాలని అధికారులు ఓ వైపు చెబుతుండగా, కురుస్తున్న వర్షాలకు ఆర బోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతున్నది. వర్షం నుంచి ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాపాడు కోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతు న్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు