విద్యానగర్, అక్టోబర్ 19: బేస్‌బాల్‌లో ఆల్‌రౌండర్‌గా.. అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచాడు. అందరికీ ఆదర్శంగా ఉండాలనే ప్రధాన లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీల్లో రజత, వెండి, బంగారు పతకాలను సాధించాడు. పేదరికంతో ఉన్నా ఆశయం కోసం పట్టుదలతో బేస్‌బాల్ ఆటను ఎంచుకున్నాడు. తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ తనను చదివిస్త్తూ, ఆటల్లో రాణించాలనే సంకల్పంతో కొడుకును ఇంత వరకు తెచ్చారు. వారి ప్రయత్నం వృథా కాలేదు. బేస్‌బాల్ ఆటకే వన్నె తెచ్చాడు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని యాచారం తండాకు చెందిన బానోత్ బాలూనాయక్.
బాల్యం-విద్యాభ్యాసం….
హీరిబాయి-బానోత్ తులసీరామ్ దంపతుల చిన్న కొడుకు బాలూనాయక్. 1 నుంచి 3వ తరగతి వరకు యాచారం ప్రభుత్వ పాఠశాల, 4 నుంచి 8వ తరగతి వరకు సదాశివనగర్ ప్రభుత్వ పాఠశాల, 9 నుంచి 10వ తరగతి వరకు కామారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ నిజామాబాద్‌లోని ప్రభుత్వ కళాశాల, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
బేస్‌బాల్ వైపు అడుగులు..
ప్రతి ఒక్కరూ చదువుకొని ఏదో ఒక ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఉంటారు. క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ వంటి లాభదాయక ఆటల వైపు మొగ్గు చూపుతారు. ఇలాంటి తరుణంలో సంప్రదాయక క్రీడ అయిన బేస్‌బాల్‌ను బాలునాయక్ ఎంచుకున్నాడు. తొమ్మిది మంది క్రీడాకారుల్లో మెరుపులా చెలరేగి ఆల్‌రౌండర్ ప్రతిభను కనబరుస్తూ తాను ఆడిన ప్రతి చోటా ఒంటి చేత్తో జట్టును గెలిపించిన వాడిగా బాలూనాయక్ పేరు సాధించాడు. సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సలహాతోనే ఈ ఆటను ఎంచుకున్నట్లు తెలిపాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ బేస్‌బాల్ కోచ్ రాజేందర్ వద్ద నె రోజులు శిక్షణ తీసుకున్నాడు. కోచ్ సలహా మేరకు మరిన్ని మెళకువలు నేర్చుకోవడానికి ఢిల్లీలోని ప్రసిద్ధ కోచ్ అనూప్‌కుమార్ వద్ద 6 నెలలు శిక్షణ తీసుకున్నాడు.
సాధించిన విజయాలు, పతకాలు..
మరింత మందికి ఆట నేర్పుతా..
అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని అనేక విజయాలు సాధించాను. పేదరికంతో మరిన్ని పోటీల్లో పాల్గొనలేకపోతున్నాను. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటే మరిన్ని విజయాలు సాధిస్తాను. ప్రభుత్వాలు అవకాశం ఇస్తే తన ఆటను పలువురికి నేర్పుతాను. ప్రభుత్వం తనను ఆదుకొని ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నా.
– బానోత్ బాలు నాయక్, బేస్‌బాల్ జాతీయ క్రీడాకారుడు