రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్‌కే సాధ్యమని, అప్పుల దేశం గా మార్చడం ప్రధాని మోదీకే చెల్లిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు. మంగళవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 118 మంది లబ్ధిదారుల కు కల్యాణలక్ష్మి చెక్కులు, క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే బీజేపీ నాయకులు విమర్శించడం అర్థరహితమన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఇందులో కూడా రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.13 లక్షల కోట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వ్యాపారులకు ప్రధాని మోదీ కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకే బీఆర్ఎస్గా పార్టీని మార్పు చేశారని సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండాలన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కేసీఆర్ మా త్రం సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మో హన్, జడ్పీటీసీ ఇందిరాలక్ష్మీనర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మోపాల్ జడ్పీటీసీ కమలానరేశ్, జక్రాన్‌పల్లి ఎంపీపీ కుంచాల విమలారాజు, మోపాల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జ డ్పీటీసీ సుమలత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, పార్టీ ప్రతినిధులు కృష్ణ, రాజు, నర్స య్య, బాలగంగాధర్, కిషన్, క్రిస్టియన్లు పాల్గొన్నారు.