ముప్కాల్/మెండోరా, డిసెంబర్ 13 : ముప్కాల్ మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులకు ఐసీపీఎస్ అధికారి అనిల్‌కుమార్ బాలికల హక్కులు, పౌష్టికాహారం, ఆరోగ్యం, ఐసీడీఎస్ సేవలపై మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్వో వినోద, ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ టీచర్లు పాఠశాల ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
మెండోరా మండలం బుస్సాపూర్ కేజీబీవీ విద్యార్థినులకు జిల్లా బాలల సంరక్షణ అధికారిణి జమ్రూ, ప్రొడక్షన్ అధికారి గణేశ్ అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు, ఉమెన్ ట్రాఫికింగ్ నేరమని తెలిపారు. బాలల హక్కులపై వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయినులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.