ఇందూరు/ ఖలీల్‌వాడి/ విద్యానగర్, మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో సార్వత్రిక సమ్మె కొనసాగుతున్నది. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చాయి. ఇందులోభాగంగా ఉమ్మడి జిల్లాలో కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో రవాణా, బ్యాంకింగ్, రైల్వే, విద్యుత్ సేవలపై ప్ర భావం పడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మెకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామన్నారు.
కేంద్ర ప్రభు త్వం ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బ్యాంకులతోపాటు విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తోందన్నారు. తాము దీనిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సంఘం నాయకుడు బాలేశ్కుమార్ మాట్లాడుతూ విద్యుత్ ప్రైవేటీకరణ ఉద్యోగులకే కాకుండా ప్రజలు, రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నా రు. సమ్మెకు వ్యవసాయదారులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. జేఏసీ నాయకుడు తోట రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యుత్ చార్జీలను పెంచినట్లు తెలిపారు. కాశీనాథ్, సురేశ్‌కుమార్, పి.గంగాధర్, గంగారాంనాయక్, నాంపల్లి రామ్‌సింగ్, రాజేందర్‌గౌడ్, రాజేందర్, అశోక్, చెన్నయ్య, శ్రీనివాస్‌రావు, శ్యామ్, పెంటయ్యచారి, బాబా శ్రీనివాస్, రాజేందర్, అహ్మద్ పా షా, నరేందర్‌నాయక్, సునీత, శివాని, సువ ర్ణ, ప్రజ్ఞ, కళ్యాణ్, సతీశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
నగరంలో భారీ ర్యాలీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కనీస వేతనం, సమానత్వ పనులు లేకుండా లేబర్ చట్టాలు ఎందుకోసమన్నారు. అవి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉన్నాయని, వెంటనే వాటిని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ర్యాలీలో టీఎన్జీవోస్, బీఎస్ఎన్ఎల్, తపాల శాఖ, వివిధ సంస్థల్లో పని చేస్తు న్న కార్మికులు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్, వి ద్యుత్ ఉద్యోగులు, దవాఖాన ఎంప్లాయీస్ యూ నియన్ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. టీఎన్జీవోస్ నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద నల్లరిబ్బన్లను ధరించి నిరసన తెలిపారు. హాస్పిటల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో దవాఖాన వద్ద నిరసన తెలిపి ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కార్యదర్శి సాయిలు, సహాయ కార్యదర్శి నాగరాజు, కోశాధికారి దేవరాజు, విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు సంపత్, రాములు, మెడికల్ ఎంప్లాయీస్ నాయకులు దశరథ్,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.