విద్యార్థినులపై చేయిచేసుకున్న ఉపాధ్యాయురాలు
మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో మంగళవారం తెలుగు ఉపాధ్యాయురాలు మహేశ్వరి విద్యార్థులపై చేయిచేసుకున్నారు. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 15 మందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టినట్లు విద్యార్థినులు తెలిపారు.
- టీచర్ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
- ఒక్కరి తప్పునకు అందరికీ శిక్ష విధించడంపై ఆగ్రహం
- పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
మద్నూర్, నవంబర్ 29 : మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలో మంగళవారం తెలుగు ఉపాధ్యాయురాలు మహేశ్వరి విద్యార్థులపై చేయిచేసుకున్నారు. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న 15 మందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టినట్లు విద్యార్థినులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మూడు రోజుల క్రితం పాఠశాలలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయురాలి ఫొటో తీసి సోది తెలుగు అని కామెంట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. విషయం ఉపాధ్యాయురాలికి తెలిసింది. పోస్ట్ చేసిన విద్యార్థిని పిలిచి మందలించింది. విద్యార్థిని సైతం కుటుంబ సభ్యులతో ఉపాధ్యాయురాలి ఇంటికి వెళ్లి క్షమాపణ కోరింది. ఇంతటితో ఈ వివాదం సద్దుమణిగిందనుకున్నప్పటికీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఉపాధ్యాయురాలు విద్యార్థులపై చేయి చేసుకోవడంతో తల్లిందండ్రులకు తెలియజేశారు. ప్రిన్సిపాల్ పట్టించుకోవడంలేదని విద్యార్థులు తెలిపారు. ఒక్కరు పోస్ట్ చేస్తే అందరినీ ఎందుకు కొట్టారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలిని ప్రశ్నించారు. పిల్లలు తప్పు చేస్తే తమకు చెప్పాలని, లేదంటే మందలించాలని ఆడపిల్లలని సైతం చూడకుండా ఈ విధంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని వారన్నారు. తమను కొట్టినందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ తీరుకు నిరసనగా విద్యార్థులు పాఠశాల ముందు బైఠాయించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ లావణ్యను వివరణ కోరగా విద్యార్థినులను కొట్టిన మాట వాస్తవమేనని, ఉన్నతాధికారుల దృష్టికిఈ విషయం తీసుకెళ్తానని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Students concern
- Teacher
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

