ఖలీల్‌వాడి, నవంబర్ 10 : మున్నూరుకాపు జోలికి వస్తే ఊరుకునేది లేదని, మునుగోడులో గెలుపును ఓర్వలేక ఈడీతో దాడులు చేయిస్తున్నారని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం చొరవతో హైదరాబాద్‌లో మున్నూరుకాపులకు ఐదు ఎకరాల భూమి, 5కోట్లు మంజూరు చేయించారని, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర మున్నూరుకాపుల ఐకాన్లని అన్నారు. మున్నూరుకాపుల ఓట్లతో గెలిచిన బీజేపీ నేతల ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. మునుగోడులో ఓడిపోయామని ఈడీతో దాడులు చేయిస్తూ భయపెట్టాలని చూస్తున్నారని, బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదంటూ ఎంపీ అర్వింద్ అసత్యప్రచారాలు చేస్తున్నారని, గ్రామాలకు వెళ్లి చూస్తే తెలుస్తుందని బాజిరెడ్డి జగన్ సూచించారు. ఇంట్లో కూర్చొని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నాయకులకు బురదజల్లడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి సిర్నాపల్లి మధుసూదన్, కేసీఆర్ సేవాదళ్ రూరల్ అధ్యక్షుడు దేవేందర్, పుప్పాల రవి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సిర్ప రాజు, యెండల ప్రదీప్, గాండ్ల లింగం, చింతకాయల రాజు, భూషణ్, సృజన్, సంతోష్, కిషన్, పుప్పాల భాజన్న పాల్గొన్నారు.
కమ్మర్పల్లి(మోర్తాడ్), నవంబర్10: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఐటీ, ఈడీ దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు మున్నూరుకాపు సంఘం కమ్మర్పల్లి మండల సభ్యులు దేవేందర్, గంగారెడ్డి, దశరథ్, రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ నేతపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని సూచించారు.