నర్సయ్య తాత..ఏం జేత్తున్నవే ? సల్లంగ రచ్చబండ కాడ కుసున్నవ్..
నర్సయ్య : ఏమున్నదోయ్..గీడ కుసుంటె నాల్గు ముచ్చట్లు ఎరుకవుతయ్.. జగంల ఏం నడుస్తున్నది.. ఏం కథ.. మన్సునవడ్తది గదా అని గీడ సల్లంగ తిరం బట్టిన.
గట్లనా.. మరి ఏం ముచ్చట్లు ఇనవడ్డయే?
ఇంకేం ముచ్చట మనుమడా.. గా సంటర్ సర్కారోళ్లు మనల్ని నూకలు బుక్కుమంటున్నరట గదనోయ్. గిదేం ఇసెంత్రం. మునపటిసంది మనకాడ ఆనకాలమైనా, ఎండకాలమైనా అడ్లే పండిత్తం. గప్పటిసంది రొండు కాలాల్ల పండినఅడ్లన్నీ గొనేటోళ్లు. గిప్పుడేం గత్తర పుట్టిందటనోయ్ గాళ్ల్లకు.
అవునవును తాత..మనతాన పండుతున్న యాసంగి అడ్లను కొనేదిలేదని గా సెంట్రల్ సర్కారు మొండికేసిందే. దానిమీద కేసీఆర్ సార్ కొనాల్సిందేనని టైట్ జేస్తున్నడు. మనకోసమే గదనే. గదానికోసమే మన మంత్రులను ఢిల్లీకి పంపిండు. అక్కడ గీ అడ్లుగొనే శాఖ మంత్రి మనోళ్లతోని మాట్లాడుకుంట మీ తెలంగాణోళ్ల్లకు నూకలు తినుడు నేర్పుండ్రి అన్నడటనే..
అరె.. గిదేం ముచ్చటనోయ్..గీ దినంల తెలంగాణల నూకలు తినే ముచ్చటున్నదా..? జమాన్ల ఆనలు వడక, నీళ్లు లేక, భూములన్నీ పారకమెత్తిపోయి కరువత్తుండె. గప్పటి సర్కార్లకు, అప్పట్ల లీడర్లకు పారకం నీళ్ల మీద పట్టి లేకుంటుండే. గట్లవుట్ల తినెతందుకుసుక దిక్కులేక నూకలుదిన్న దినాలుంటుండే. ఎట్లయితే కేసీఆర్ అచ్చిండో తెలంగాణ అచ్చింది. పొద్దుమాపు కరంటు, గా కాళేశ్వరం నీళ్లు, యాడవడ్తె గాడ ఎత్తివోతలు, కాల్వలు తీస్కచ్చిండు. ఎటుజూసినా పడీతు భూములన్నీ పారకం భూములైనయ్. అడ్లు మస్తుగ పండుతున్నయ్. ఎవుసం మంచిగైంది. పట్టెడన్నం దొర్కని జాగలసుక పట్టేంత అన్నం దొర్కుతున్నది.
గీతీరంగా మారిన తెలంగాణల ఇంకా నూకలు తింటరా?..
ఏమోనే తాత గీడ ఊర్ల నీకు దెల్సినంతసుక గా ఢిల్లీ వాళ్లకు తెల్వకపాయె.గాల్లకు తెల్వకగాదోయ్ మనుమడా.. తెలంగాణల కేసీఆర్ అచ్చినంక నూకలు తినే రోజులు పోయినయని ఢిల్లీలున్న సెంట్రల్ గవర్మెంటోళ్లకు మస్తు దెలుసు. కావాలనే సతాయిత్తరు. తెలంగాణల పంటలు పండే మంచి దినాలు అచ్చినయ్ గదా..గవన్నీ మనకండ్ల తోటి సూస్కుంటసుక మనమే యేహే..ఏం మంచిగ లేదని అనుకోవాల.. గదన్నట్లు గాళ్ల మత్లబు. గీడ కండ్ల ముందట గింత మంచిగైనదంత గనవడంగసుక గాళ్ల మాటలు మనం ఎట్ల నమ్ముతమోయ్.
ఆహా..ఏం ఉషారున్నవే తాత..నీకు గింత తెలుస్తదానే ?
అవునోయ్. మరి ఏమనుకుంటున్నవ్. గిదేవూరనుకుంటున్నవ్. మోతె. గీడ గిదే రచ్చబండ కాడ తెలంగాణ ముచ్చట్లు ఎన్ని మాట్లాడుకుంట.. ఎన్ని ఇనుకుంట..కేసీఆర్ సారుతోని మా మోతె నడ్సిన సంగతులు.. గిట్ల మస్తు సూస్కుంట ముసలయితిమి. గిప్పుడు గాయనతోని కావాల్నని కిరికిరి వెట్టుకుంట..మనల్ని నూకలు తినాలన్నట్లు మాట్లాడినోళ్లను జూస్తే నగత్తున్నది గదనోయ్. – కమ్మర్పల్లి, మార్చి 25