నిజామాబాద్ రూరల్, నవంబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించ డం బీజేపీకి చెంప పెట్టులాంటిదని రూరల్ ఎమ్మె ల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ము నుగోడు విజయంతో రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయం వద్ద ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఆయన విజయోత్సవ సంబురా ల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్ని తీసుకొచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు కూడా ఆ పార్టీ అభ్యర్థికి ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు చూపిన కాంట్రాక్టుల ఆశకు లొంగిన రాజగోపాల్‌రెడ్డి ఓటమి చవిచూసే పరిస్థితి నెలకొందన్నారు.
మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కుట్రతో తీసుకువచ్చిన ఉప ఎన్నికతో ప్రజాధనం దుర్వినియో గం అయ్యేలా చేశారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ బడాబాబులకు ధారాదత్తం చేసి కార్మికులకు, సిబ్బందికి ఉపాధి కరువయ్యేలా చేశా రని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వాన్ని పెంచి పోషిస్తూ అభివృద్ధికి పాటుపడకుండా కాలయాపనతో పబ్బం గడుపుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పా ర్టీని స్థాపించి జాతీయస్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు మునుగోడు ఉపఎన్నిక స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రభాకర్‌రెడ్డి విజయ సాధనకు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేయడం తో పాటు దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ముందు కు సాగడానికి మునుగోడు ఉప ఎన్నిక శుభ పరిణామంగా నిలిచిందని పేర్కొన్నారు.