నిజామాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో సాటిలేని విజయాన్ని దక్కించుకున్నది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానా న్ని గులాబీ పార్టీ కైవసం చేసుకొని తిరుగులేని శక్తిగా అవతరించింది. రాష్ట్రంలో వరుసగా ఏ ఎన్నికలు వచ్చినా సత్తా చాటుతున్న అధికార పార్టీ మరోమారు రికార్డు స్థాయి విజయంతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నది. భారతీయ జనతా పార్టీ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టి మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. టీ(బీ)ఆర్ఎస్ పార్టీ గెలుపులో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధుల కృషి సైతం కలిసి వ చ్చింది. దాదాపు అక్టోబర్ 6నుంచి మునుగోడులో తమకు అప్పగించిన గ్రామాలకు వెళ్లి తిష్ట వేసిన గులాబీ నాయకులు అక్కడే ఉంటూ ప్రజలతో మమేకమై ఉప ఎన్నిక విజయంలోపాత్రదారులయ్యారు.
బీజేపీ చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీఆర్ఎస్ పరిపాలనలో సబ్బండ వర్గాలకు దరి చేరిన పథకాల వివరాలతో ఓట్లు అడిగి పైచేయి సాధించారు. టీఆర్ఎస్ విజయంతో తెలంగాణ అంతా ఏయ్ బిడ్డా… ఇది కేసీఆర్ అడ్డా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతుండడం విశేషం.
సత్తా చాటిన మనోళ్లు…
మునుగోడు నియోజకవర్గంలో చండూర్, చౌటుప్పల్, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, నారాయణపూర్ మండలాలున్నాయి. ఇందులో మూడు మండలాల్లోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ) పరిధిలోని గ్రామాలను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజా ప్రతినిధులకు కేటాయించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చౌటుప్పల్ మండలంలోని డి.నాగారాం, దామెర, చింతలగూడెం గ్రా మాలు, చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూర్, మందొల్లగూడెం గ్రామాలను డీసీసీబీ చైర్మ న్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రచార బాధ్యతలను నిర్వహించి సత్తా చాటారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లోనే తిష్ట వేసి ఓట్లను రాబట్టారు. చండూర్ మండలంలోని గట్టుప్పల్ గ్రామానికి ఇన్చార్జిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి డి.మల్కాపూర్ గ్రామంలో ప్రచార బాధ్యతలను సమగ్రంగా నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని రావిగూడెం, జక్కలవారి గూడెం, జమస్తాన్‌పల్లి పల్లె జనాలను పోగు చేసి చైతన్యం కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సైతం పిలిపాలపుల, గంగోరిగూడెం, రాదుపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు అవసరాన్ని బట్టి సామాజిక వర్గాల వారీగా జరిగిన మీటింగ్‌లకు హాజరై ప్రచారంలో భాగస్వాములయ్యారు.
అభివృద్ధే తారకమంత్రం…
మునుగోడు అంటే గుర్తుకు వచ్చేది ఫ్లోరోసిస్ సమస్య. మునుగోడులోని మర్రిగూడ, చండూర్, నారాయణపురం మండలాల్లో విపరీతంగా ఫ్లోరోసిస్ సమస్య ఉండేది. అనేక వందల మంది ఈ స మస్యతో కాళ్లు, చేతులు వంకర్లు పోయి అవస్థలు పడ్డారు. దీని నివారణకు ఏ ప్రభుత్వం చర్యలు తీ సుకున్న పాపాన పోలేదు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఫ్లోరైడ్ నిర్మూలనకు నడుం బిగించి మిషన్ భగీరథ నీటిని ఇం టింటికీ అందించారు. ఇది కేసీఆర్ సర్కారు సాధించిన విజయాల్లో అతి ముఖ్యమైనది. గత ప్రభుత్వా ల కాలంలో అభివృద్ధి పనులు కూడా అంతంత మాత్రమే. ఒకప్పుడు సింగిల్ లైన్ రోడ్లు అవి కూడా గతుకులతో కూడుకున్నవి దర్శనం ఇచ్చేవి. ఇప్పుడు ప్రధాన పట్టణాలకు రెండు లైన్ల రోడ్ల ని ర్మాణం, లింక్ రోడ్లు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఇవేకాదు మిషన్ భగీరథ, మిషన్ కాకతీ య, పల్లె ప్రగతి, పింఛన్లు ఇలా వందలాది పథకా లు ప్రవేశ పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇవన్నీ మునుగోడు ప్రజలు గమనించారు. ఆలోచించే కుతంత్రాలు, కుట్రలు చేసే భారతీయ జన తా పార్టీకి సరైన రీతిలో బుద్ధి చెప్పి అభివృద్ధే ఎజెండాగా పని చేస్తున్న టీ(బీ)ఆర్ఎస్కు జై కొట్టారు.
మోదీ పాలనకు జవాబిదీ…
మునుగోడులో భారతీయ జనతా పార్టీ అన్నది ఎక్కడా ఉనికిలో లేదు. బలమైన కాంట్రాక్టర్‌గా పేరు పొందిన రాజగోపాల్ రెడ్డిని కాంట్రాక్టుల పేరిట లొంగదీసుకుని రాజకీయ పాచికను బీజేపీ విసిరింది. రాజగోపాల్ రెడ్డి రూపంలో బీజేపీ ఎన్నికల బరిలో నిలవగా మునుగోడు ప్రజలు సర్వం గమనించి సరైన జవాబును అందించారు. దేశంలో అన్ని రకాల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేంద్రంలోని బీజేపీ సర్కారే. ఆ పార్టీ దేశానికి ఎంత ప్రమాదకరమో రాజగోపాల్ రెడ్డికి కూడా తెలియదంటూ సెటైర్లు గడిచిన నెలన్నర రోజులుగా వైరల్ అయ్యాయి.
కాంట్రాక్టుల కోసం మతతత్వ బీజేపీలో చేరిన ఆయనకు అది మున్ముందు తెలుస్తుందంటూ విపరీతమైన పోస్టులు కనిపించాయి. మోదీ పాలనలో గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలు చుక్కలను తాకుతున్నాయి. నల్లధనం తీసుకొస్తా… ప్రజల ఖాతాలో వేస్తా అని నోట్లు రద్దు చేసి మోసం చేసిన సంగతి దేశ ప్రజలందరికీ తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దేశాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టిన ఘనత మోదీదే. వ్యవసాయ చట్టాల రూపంలో రైతులను ఇబ్బంది పెట్టిన విషయాన్ని మునుగోడు ప్రజలు గమనించారు. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న బీజేపీకి మునుగోడులో చోటివ్వద్దని ప్రజలు నిర్ణయించారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గులాబీపార్టీని గెలిపించుకున్నారు.