బోధన్, నవంబర్ 6: సంక్షేమ పథకాల అమలులో కుల సంఘాలు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నాయని, సమాజ శ్రేయస్సుకు సభ్యులు కృషి చేయాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణ శివారులోని కమ్మ సంఘ భవనంలో ‘కమ్మవారి కార్తీకమాసం, వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండవ హాజరై మట్లాడారు. బోధన్ కమ్మసంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. మారిన పరిస్థితులకు అనుగునంగా అన్ని విషయాల్లోనూ కుల సఘాల పాత్ర పెరిగిందని గుర్తుచేశారు. పార్టీలకు అతీతంగా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. బోధన్ సంఘం ఆధ్వర్యంలో కాకతీయ చేయూత ట్రస్ట్ బాలుర వసతిగృహాన్ని ఏర్పాటుచేయడం ప్రశంసనీయమన్నారు.
వైద్యులు పల్లెంపాటి కృష్ణప్రసాద్, శ్రీకాంత్, విశ్వజల తదితరులను సన్మానించారు. సంఘం అధ్యక్షుడు పల్లెంపాటి శివన్నారాయణ, మండవ సతీమణి నళిని, ఉమ్మడి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అమర్‌నాథ్‌బాబు, కమ్మ సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలగర శ్రీనివాస్‌రావు, రాష్ట్ర కోశాధికారి కండెపనేని రత్నాకర్‌రావు, సమాజ సేవకుడు ముమ్మలనేని రాజశేఖర్, బోధన్ కమ్మ సంఘం ప్రధాన కార్యదర్శి దావులూరి హరినాథ్‌బాబు, కోశాధికారి శ్రీధర్, ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి కొండయ్య చౌదరి, బోధన్ సంఘం ప్రతినిధులు పీవీ సుబ్బారావు, ఎం.అప్పారావు, గంగవరపు ఆదినారాయణ, చలసాని శ్రీకాంత్, శ్రీహరి, నాగేశ్వరరావు, సంపత్‌కుమార్, సాయిబాబా, శ్రీనివాస్‌రావు, పి.గాంధీ, రవీంద్రబాబు, వేములపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.