డిచ్పల్లి, నవంబర్ 3 : ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాంగ్ (మనాలి)లో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు గురువారం తరలివెళ్లినట్లు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. శిబిరానికి కాంటిగ్నెంట్ లీడర్‌గా డాక్టర్ స్రవంతిని నియమించినట్లు చెప్పారు.
సోలాంగ్‌లోని అటల్ బీహార్ వాజ్పాయ్ పర్వతారోహణ, క్రీడల సంస్థల్లో శిక్షణ పొందుతారని, అనంతరం పర్వతా రోహణ, రాక్ ైక్లెంబింగ్, వాటర్ స్పోర్ట్స్ తదితర అంశాల్లో పాల్గొంటారని తెలిపారు. వీరికి మనాలి ప్రాంతీయ కార్యాలయంలో ఒకరోజు ప్రత్యేక శిక్షణ ఉంటుందని, హిమాలయాల్లో (సోలాంగ్ వ్యాలీ) ఒకరోజు ఉంటారని, వీటితో పాటు అన్ని రాష్ర్టాలకు సంబంధించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు వీసీ రవీందర్, రిజిస్ట్రార్ విద్యావర్ధిని అభినందనలు తెలిపారు.