బాల్కొండ/ భీమ్‌గల్/ మాక్లూర్/ ఏర్గట్ల/ ఆర్మూర్, నవంబర్3: బాల్కొండ, భీమ్‌గల్, మాక్లూర్, ఏర్గట్ల మండలాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు, పీఎం కిసాన్ ఈ-కేవైసీ, రైతుబీమా, ఎర్ర జొన్న సాగుపై అధికారులు గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్ మార్కెట్ యార్డులో మండల వ్యవసాయాధికారి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో, భీమ్‌గల్ మండలంలోని పిప్రి, ముచ్కూర్ గ్రామాల్లో ఏఈవోలు లక్పతి, భార్గవ్, మాక్లూర్ మండలంలోని మదన్‌పల్లిలో ఏడీఏ విజయలక్ష్మి, ఏవో పద్మ, ఏఈవో నాయక్, ఏర్గట్లలోని రైతు వేదికలో మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్, ఎంపీపీ ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎకరానికి 50 ఆయిల్‌పామ్ మొక్కల చొప్పున అందిస్తామని, ఆయిల్‌పామ్ పంట సాగుకు కావాల్సిన డ్రిప్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ, బీసీలకు 90 శాతం, చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తుందని అకారులు తెలిపారు. ఎకరానికి రైతు రూ. వెయ్యి చెల్లిస్తే ప్రభుత్వం రూ.9650 సబ్సిడీపై 50 చొప్పున ఆయిల్‌పామ్ మొక్కలను అందిస్తుందని తెలిపారు.
ఆయిల్‌పామ్ పంటలో ఎరువులు, అంతర పంటల సాగు కోసం ఎకరానికి రూ.4200 చొప్పున నాలుగేండ్ల వరకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మాక్లూర్ మ ఆర్మూర్ ఏడీఏ విజయలక్ష్మి, ఏవో పద్మ, ఏఈవో నాయక్, నవీణ్, మదన్‌పల్లి సర్పంచ్ శంకర్‌గౌడ్, ఎంపీటీసీ గోవూరు ఒడ్డెన్న, మహేశ్, జీపీ కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.
ఆలూర్‌లో ఆయిల్‌పామ్ సాగు, యాసంగిలో ఎర్రజొన్న పంట సాగుపై తీసుకోవాల్సిన చర్యలను మండల వ్యవసాయాధికారి హరికృష్ణ రైతులకు వివరించారు. పీఏసీఎస్ చైర్మన్ కల్లెం భోజారెడ్డి, ఏఈవో వసూధాం పాల్గొన్నారు.