డిచ్పల్లి, నవంబర్ 3 : మండలంలోని ధర్మారం టీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల హాస్టల్ విద్యార్థులు కె.మధు, ఎం. మేఘనను ప్రిన్సిపాల్ సంగీత గురువారం అభినందించారు. గతనెల 18న మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ రెసిడెన్సియల్ బాయ్స్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు పంజాబ్లోని లుథియానాలో నిర్వహించే జాతీయస్థాయి క్రీడాపోటీల్లో వారు పాల్గొననున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ నీరజారెడ్డి, పీఈటీ జ్యోత్స్న, స్కూల్ హౌస్ టీచర్స్ శకుంతల, విక్టోరియా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో లుథియానాలో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే సబ్ జూనియర్ బేస్బాల్ జాతీయస్థాయి పోటీలకు మిట్టాపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఆర్. మురళి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని కె. పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మురళిని ప్రధానోపాధ్యాయినితోపాటు సర్పంచ్ తేలు గణేశ్, ఎంపీటీసీ సభ్యుడు బాలగంగాధర్, ఉపసర్పంచ్ కిషన్, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్, గ్రామపెద్దలు ఒడ్డెం నర్సయ్య, గోపు వెంకన్న, గోపు రాజేశ్వర్, స్కూల్ రాజన్న, గంగరత్నం, వ్యాయామ ఉపాధ్యాయుడు మార్కంటి గంగామోహన్, ఉపాధ్యాయులు అభినందించారు.