బాన్సువాడ, నవంబర్ 1 : సీఎం కేసీఆర్‌తోనే అన్ని వర్గాల అభ్యున్న తి సాధ్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎన్నికలతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎన్నికను ఆశామాషీగా తీసుకోకూడదని, కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. తాను 23 రోజులుగా మునుగోడు ఎన్నికల నేపథ్యంలో మీ గ్రామ బిడ్డగా, నా కుటుంబానికి దూరంగా ఉన్నానన్నారు. మీరే నా కుటుంబ సభ్యులుగా గ్రామాల్లో ఎన్నికల ఇన్చార్జిగా వచ్చి ప్రచారాన్ని చేపట్టామన్నారు. మంగళవారం మునుగోడు ఉప ఎన్నిక చివరి రోజు చౌటుప్పల్ రూరల్ మండలంలోని చిన్న కొండూర్, మందోల గూ డెం గ్రామాల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్), సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు, మహిళలతో కలిసి ప్రచారం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, నాయకుడు వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, వైస్ చైర్మన్ రాజు, సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధ ర్, సొసైటీ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు మహ్మద్ ఎజాజ్, మల్లారెడ్డి, బండ్ల శ్రీకాం త్, నరేశ్, బట్టు మోహన్, జీవన్, తయ్యబ్ అర్బాస్, జిన్న రఘురామయ్య, సయ్యద్ ఇలియాస్ పాల్గొన్నారు.
మునుగోడు నుంచి తిరిగి వచ్చిన నాయకులు
తాడ్వాయి, నవంబర్ 1: మునుగోడులో ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు మంగళవారం తిరిగివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే ఆయన గెలుపునకు సహకరిస్తాయని ఏఎంసీ చైర్మన్ సాయిరెడ్డి, సీడీసీ చైర్మన్ మహిందర్, విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, నాయకులు రమేశ్‌రావు, మంగారెడ్డి, ధర్మారెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.