ఖలీల్వాడి, నవంబర్ 1:చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పోస్టు కార్డు ఉద్యమం కొనసాగు తున్నది. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నిరసన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు మంగళవారం లేఖ రాశారు చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నిరసన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కేటీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా లేఖాస్ర్తాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంధిస్తున్నారు. ఇందులోభాగంగా నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మంగళవారం లేఖ రాశారు. చేనేత, ఇతర రంగాలపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేశారు.