నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్1 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకొని మద్దతు ధర పొందాలని శాసనమండలి సభ్యుడు వి.గంగాధర్‌గౌడ్ సూచించారు. మంగళవారం డిచ్పల్లి మండలంలోని రాంపూర్, మిట్టాపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్‌తో కలిసి ప్రారంభించారు. ధాన్యం ‘ఎ’ గ్రేడ్‌కు రూ.2060, ‘బి’ గ్రేడ్‌కు రూ.2040 ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విండో చైర్మన్ తారాచంద్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డిచ్పల్లి సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్ తో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఘన్పూర్, దూస్‌గాం, ఖిల్లా డిచ్పల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. బ్రాహ్మణపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లి, తొర్లికొండ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు.
ఎంపీపీ కుంచాల విమలరాజు, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలో ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్పల్లి, తిర్మన్‌పల్లి గ్రామాల్లో ప్రాథమిక సహకార సొసైటీ, ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ సాంబారి మోహన్, ఎంపీపీ బాదావత్ రమేశ్ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. మల్లాపూర్ గ్రామంలో ఎంపీపీ రమేశ్ నాయక్‌తో కలిసి ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కోటగిరి మండలం యాద్గార్పూర్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
సిరికొండ, తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ అధ్వర్యంలో మండలంలోని రావుట్ల, న్యావనంది, వర్జన్తండలో కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మాలావత్ మాన్సింగ్, సొసైటీ చైర్మన్లు మైలారం గంగారెడ్డి, రాములు నాయక్ ప్రారంభించారు. ముప్కాల్ మండలంలోని వేంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ జక్క రాజేశ్వర్, ఎంపీపీ సామ పద్మా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. జడ్పీటీసీ బద్దం నర్సవ్వా నర్సారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి, రాయకూర్, రాణంపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను రైతు బంధు సమితి మండల కన్వీనర్ తోట సంగయ్య ప్రారంభించారు. విండో వైస్‌చైర్మన్ అరుణ్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.