రుద్రూర్, నవంబర్ 1: మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చివరిరోజు మంగళవారం చందూర్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు జోరుగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే ఓటేయాలని కోరారు. ప్రచారంలో మోస్రా, చందూర్ మండలాల నాయకులు హన్మంత్‌రెడ్డి, అంబర్‌సింగ్, సాయారెడ్డి, సత్య నారాయణ పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారం..
ఆర్మూర్, నవంబర్1: మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపూర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు మంగళవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు పస్క నర్సయ్య, మాస్త ప్రభాకర్, మెట్టు సంతోష్, ఆకుల రజనీశ్, మాక్లూర్ రంజిత్, పండిత్ పవన్, కల్లెం మోహన్‌రెడ్డి, మార్కంటి మల్లేశ్, సాయన్న, సుక్కి సుధాకర్, మేడిదాల రవిగౌడ్, కల్లెం భోజారెడ్డి, అసపురం శ్రీనివాస్‌రెడ్డి, పెంట భోజారెడ్డి, సోమ హేమంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.