ఆర్మూర్, అక్టోబర్ 31 : అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని పోలీసు కమిషనర్ కెఆర్.నాగరాజు అన్నారు.ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్లో సోమవారం ఏసీపీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ రక్తదానంతో ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టిన వారమవుతామన్నారు.
ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఒక్క పిలుపుతో రక్తదానం చేయడం, ర్యాలీలో యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ శిబిరంలో 150 మంది యు వకులు, పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సీఐలు సురేశ్‌బాబు, గోవర్ధన్‌రెడ్డి, ఎస్సైలు, ఏఎస్సైలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.