బోధన్‌రూరల్, అక్టోబర్ 30: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆదివారం మినార్పల్లి, సంగం, భవానీపేట్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. భవానీపేట్ గ్రామానికి 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సంగం గ్రామానికి 6 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సంగం – అమ్దాపూర్ రోడ్డు పనులను పూర్తి చేయిస్తామన్నారు.
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు గ్రామాభివృద్ధ్దికి ఇస్తామన్నారు. గ్రామాల వారీగా ప్రజలు అందించిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. అంతకు ముందు మినార్పల్లి సొసైటీ, సంగం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. భవానీపేట్‌లో కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. మినార్పల్లి గ్రామానికి 25 డబుల్ బెడ్ రూంతో పాటు పలు అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, బోధన్ ఎంపీపీ బుద్దెసావిత్రీరాజేశ్వర్, జడ్పీటీసీ గిర్ధావర్ లక్ష్మీ గంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు గిర్ధావర్ గంగారెడ్డి, శరత్, ఏఎంసీ చైర్మన్ వీఆర్దేశాయి, వైస్ చైర్మన్ సాలూరా షకీల్, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మానిక్ వెంకట్‌రెడ్డి, పార్టీ నాయకుడు కన్వీనర్ బుద్దెరాజేశ్వర్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సన్న, ప్రధాన కార్యదర్శి సిర్పా సుదర్శన్, మినార్పల్లి సర్పంచ్ మూడ్ హిరిబాయి, తారాచంద్‌నాయక్, సంగం సర్పంచ్ కల్లురి అంజమ్మ గంగారెడ్డి, ఎంపీటీసీ హన్మంతు, సొసైటీ చైర్మన్ ముత్తరెడ్డి, సిరాజ్, భవానిపేట్ సర్పంచ్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
బోధన్, అక్టోబర్ 22: పట్టణంలోని శ్రీనివాస్‌నగర్ క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గింజుపల్లి శరత్, బోధన్ ఎంపీపీ వైస్ చైర్మన్ కోట గంగారెడ్డి, బోధన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఉద్మీర్ లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్లు మాసూల్ శ్రీనివాస్, బేగారి పోశెట్టి, హీర్యా నాయక్, సొసైటీ సీఈవో ఉమాకాంత్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
రెంజల్, అక్టోబర్ 30: మన ఊరు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా చివరి రోజు శనివారం రాత్రి కందకుర్తి గ్రామంలో ఎమ్మెల్యే షకీల్ పర్యటించారు. గోదావరి పుష్కర క్షేత్రంలో సమస్యలను పరిష్కరించాలని ఆలయ కమిటీ తరఫున ఉపసర్పంచ్ యోగేశ్ వినతి పత్రం అందజేశారు. గ్రామంలో బీసీ కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. డీసీసీబీ డైరక్టర్ గిర్ధావార్ గంగారెడ్డి, కందకుర్తి సర్పంచ్ ఖలీంబేగ్, నీలా విండో చైర్మన్ ఇమ్రాన్బేగ్, ఎంపీటీసీ అసద్బేగ్, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.