లింగంపేట, అక్టోబర్ 30: రైతుల సంక్షేమ మే రాష్ట్ర ప్రభు త్వ ధ్యేయమని ఎంపీపీ గరీబున్నీ సా బేగం అన్నా రు. లింగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో లింగంపల్లి, లింగంపేట, నల్లమడుగు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు షమీమున్నీసా బేగం, లింగంపేట సహకార సంఘం చైర్మన్ దేవేందర్‌రెడ్డి, నల్లమడుగు సహకార సంఘం చైర్మన్ సుప్పాల రమేశ్, నల్లమడుగు సర్పంచ్ కొండ మంజులతో పాటు సహకార సంఘం డైరెక్టర్లు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ నాయకులు, రైతులు, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొన్నారు.
పిట్లం, అక్టోబర్ 30: రైతులను ఆదుకునేందుకే ప్రభు త్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని పిట్లం-చిల్లర్గి సహకార సంఘం చైర్మన్ శపథంరెడ్డి అన్నారు. పిట్లం, అన్నారం గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు విజయ్, షఫీ, నర్సాగౌడ్, జొన్న శ్రీనివాస్‌రెడ్డి, గొల్ల లక్ష్మణ్, కో-ఆప్షన్ సభ్యుడు రహిమాన్, వార్డు సభ్యుడు సత్యం, సీఈవో సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్, అక్టోబర్ 30: బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో బోర్లం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ రమణారావు దేశ్ముఖ్తో కలిసి సొసైటీ చైర్మన్ సంగ్రాం నాయక్ ప్రారంభించారు. ఎంపీటీసీ సభ్యులు జెట్టి హన్మాండ్లు, సుధాకర్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, గోపాల్, బండారి సాయిలు పాల్గొన్నారు.