బోధన్, అక్టోబర్ 21: నియోజకవర్గంలో ఈనెల 27వ తేదీ నుంచి మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించనున్నారు. 27న నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఉదయం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎమ్మెల్యే పర్యటిస్తారు. అనంతరం పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు తుంగిని గ్రామంలో పర్యటన అనంతరం సమావేశం నాళేశ్వర్ గ్రామంలో రాత్రి బస ఉంటుంది. 28న ఉదయం నిజాంపూర్లో పర్యటన, సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలక శాఖాపూర్లో, సాయంత్రం 4గంటలకు సిరన్పల్లిలో పర్యటిస్తారు. 28న రాత్రి రెంజల్ మండలంలోని సాటాపూర్లో రాత్రి బస చేస్తారు. 29న ఉదయం రెంజల్ మండలం కందకుర్తిలో, మధ్యాహ్నం 2.30 గంటలకు పేపర్మిల్లో అనంతరం పబ్లిక్ మీటింగ్, 29న రాత్రి బోధన్ మండలంలోని సంగం గ్రామంలో బస చేస్తారు. 30న ఉదయం సంగం గ్రామంలో పర్యటన పబ్లిక్ మీటింగ్, గ్రామ శివారులోని దర్గాలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. బోధన్ మండలంలోని కుమన్పల్లి గ్రామంలో పర్యటన, మీటింగ్, రాత్రి భోజనాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. 31న ఉదయం బోధన్ పట్టణంలో ఉదయం 8 గంటల నుంచి 31వ వార్డులో పర్యటన, పబ్లిక్ మీటింగ్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 34వ వార్డులో పర్యటిస్తారు. 31న రాత్రి ఎడపల్లి మండలంలోని టానాకలాన్ గ్రామంలో ఎమ్మెల్యే బసచేస్తారు. నవంబర్ 1న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గ్రామంలో పర్యటన, పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం వరకు తిరిగి కుర్నాపల్లి గ్రామంలో పర్యటన, పబ్లిక్ మీటింగ్ అనంతరం గ్రామ శివారులోని అబ్బయ్య దర్గా వద్ద రాత్రి భోజనంతో కార్యక్రమాలు ముగుస్తాయి.