విద్యానగర్/బాన్సువాడ టౌన్/ నిజాంసాగర్/లింగంపేట/ తాడ్వా యి, అక్టోబర్ 18 : మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తరఫున ప్రజాప్రతినిధులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో మంగళవారం పర్యటించి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మునుగోడులో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ హఫీజ్ తదితరులు ప్రచారం చేశారు.
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర చేనేత, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బాన్సువాడ సీనియర్ నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్‌నాయక్, బుడ్మి సొసైటీ చైర్మన్ శ్రీధర్, తిర్మలాపూర్ సర్పంచ్ రఘు, కౌన్సిలర్ లింగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రావిగూడెం గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. అవ్వా, తాతా అంటూ పలకరించారు. ఆయన వెంట రావిగూడెం టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
జక్కల్వారి గూడెంలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయనతో పాటు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్‌అలీ, నాయకులు సంగమేశ్వర్‌గౌడ్, కాశయ్య తదితరులు ఉన్నారు. మునుగోడు మండలంలోని పులిపలుపుల గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి లింగంపేట మండల నాయకులు గాండ్ల నర్సింహులు, మహిపాల్‌రెడ్డి, భూపతి, రసూల్, కృష్ణ, సంగమేశ్వర్ తదితరులు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. తాడ్వాయి మండలానికి చెందిన ఏఎంసీ చైర్మన్ సాయిరెడ్డి, సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఎర్రాపహాడ్ సర్పంచ్ నర్సారెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు.