కోటగిరి / మోస్రా (చందూర్), వర్ని/ ఆర్మూర్/ బాల్కొండ, అక్టోబర్ 16 : మునుగోడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని కోటగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్ అన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో కోటగిరి, మోస్రా, చందూర్, వర్ని మండలాల నాయకులు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం కొండూర్ గ్రామంలోని 6,7 వార్డుల్లో ఆదివారం ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ఓటర్లకు వివరించారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రాజు, మండల మాజీ ప్రధానకార్యదర్శి పి.సాయిలు, చందూర్, మోస్రా నాయకులు అంబర్‌సింగ్, హన్మంత్‌రెడ్డి, బొడ్డోళ్ల సత్యనారాయణ సత్యనారాయణ, కర్లం సాయారెడ్డి, శ్రీనగర్ సర్పంచ్ రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సత్యనారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షుడు వంకా నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రామ యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. పార్టీ నాయకులు పండిత్ ప్రేమ్, నాయకులు పాల్గొన్నారు.
బాల్కొండ, అక్టోబర్ 16: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చింతలగూడెం గ్రామంలో బాల్కొండ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు పుప్పాల విద్యాసాగర్, నాగులపల్లి రాజేవ్వర్, సాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.