బాల్కొండ, అక్టోబర్ 15 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా రూ పాంతరం చెందిన క్రమంలో ఆ పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమన్న ఉద్దేశంతో ఎంతో మంది విరాళాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు తమ వంతుగా ఎంతో కొంత అందిస్తున్నారు. బీఆర్ఎస్ బలోపేతం కోసం బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం ఆసరా పింఛన్ల లబ్ధిదారులు.. తమ పెన్షన్ నుంచి కొత్త మొత్తాన్ని ఇవ్వగా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు సైతం తలో చేయి వేశారు. ఇలా జమ చేసిన రూ.90 వేల నగదును శనివారం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బాల్కొండ మండల నాయకులకు అందజేశారు. భారత్ రాష్ట్ర సమితి పేరుతో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు తమ వంతు సహకారంగా విరాళం అందించినట్లు లబ్ధిదారులు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అందాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, కేసీఆర్ రావాలి.. దేశం మారాలి అని వారు పేర్కొన్నారు.
స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేసీఆర్‌కు మద్దతుగా నిలబడిన మహిళా సంఘాల ప్రతినిధులు, బీడీ కార్మికులు, రైతుబంధు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, ఎంపీపీ లావణ్యలింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌటు గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఆకుల నరేందర్, సర్పంచ్ సునీతా నరహరి, ఎంపీటీసీలు మామిడి దివ్యారాకేశ్, కన్న లింగవ్వపోశెట్టి, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయాజ్‌అలీ, వేల్పూర్ మార్కె ట్ కమిటీ డైరెక్టర్లు వేంపల్లి చిన్నబాల్రాజేశ్వర్, సయ్యద్ మజారొద్దీన్, మాజీ ఎంపీటీసీ మహ్మద్ ఇఫ్తికరొద్దీన్, వార్డు సభ్యులు గాండ్ల రాజేశ్, సయ్యద్ రియాజ్ అలీ, నాయకులు ఎంఎ.షాహిద్, గడ్డం రవి, తోపారం గంగాధర్ పాల్గొన్నారు.