సదాశివనగర్, అక్టోబర్ 9: మన రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలకు అందిస్తూ తెలంగాణ అన్నపూర్ణగా నిలుస్తోందని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌తోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో కోటీ 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఇతర రాష్ర్టాలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు.
అనంతరం సభాపతి మాట్లాడుతూ.. మండలంలోని భూంపల్లి గ్రామం ఎత్తులో ఉందన్నారు. దీంతో గ్రామానికి ప్రాజెక్టుల నుంచి లిఫ్ట్ ద్వారా సాగునీరందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే స్థాయికి ఎదగాలి కొంత మంది ఎంపీలు రైతులను వరి పంట వేయాలని చెప్పి ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో ముఖం చాటేస్తున్నారని అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని పార్లమెంట్లో అడిగిన సందర్భాలూ లేవన్నారు.
మన రాష్ట్ర రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తీసుకోకుండా పంటలు పండించి డిపాజిట్లు చేసి తలెత్తుకు తిరగాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సాగు కోసం 24 గంటలపాటు విద్యుత్ ఇస్తున్నట్లు ఢంకా బజాయించి చెబుతున్నామన్నారు. బీఆర్ఎస్ ద్వారా దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఏఎంసీ నూతన చైర్మన్ పుల్గం సాయిరెడ్డి, పాలకవర్గ సభ్యులను అభినందించారు. అనంతరం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని పాలకవర్గ సభ్యులు సన్మానించారు.
కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జా జాల సురేందర్, ఎంపీ బీబీ పాటిల్, వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్ చారి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎంపీపీ గైని అనసూయ రమేశ్, జడ్పీటీసీ సభ్యుడు నర్సింహులు, కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్కటి బుచ్చన్న, సర్పంచులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, బడాల భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు కాట్యాడి రామారావు, మహ్మద్ సాదక్‌అలీ, ఆకుల సిద్ధిరాములు, దత్తురావు, మాలోత్ శ్రీధర్, నాగరాజుగౌడ్, తోట మధుకర్, పెద్ద రా జిరెడ్డి, గొర్రె మహేశ్వరి, ప్రేమదాస్, డీఎంవో రమ్య, విండో చైర్మన్ కమలాకర్ రావు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.