నవీపేట, జూలై 16: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెక్‌డ్యామ్‌లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు శనివారం నిజాంపూర్‌లో వర్షాలకు దెబ్బతిన్న చెక్‌డ్యామ్, తుంగినీ హన్మాన్మందిరానికి వెళ్లే రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రోడ్లు, చెక్‌డ్యామ్‌లు ధ్వంసమయ్యాయని, వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ నీరడి సబితా బుచ్చన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీ.నర్సింగ్‌రావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మార్నేని కృష్ణమోహన్‌రావు, నవీపేట సొసైటీ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న, నిజాంపూర్, లింగాపూర్ సర్పంచులు బత్తూర్ సాయిలు, విజయ రమేశ్, కేసీఆర్ దళం జిల్లా అధ్యక్షుడు రమణారావు, నాయకులు మనోహర్‌రావు, పీఆర్ డిప్యూటీ ఈఈ రాజయ్య, ఇరిగేషన్ ఈఈ రైతులు ఉన్నారు.