నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 18 : పక్షం రోజుల పాటు నిర్వహించిన పల్లెప్రగతి పనులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గ్రామాల అభివృద్ధికి సహకరించిన దాతలతో పాటు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
నవీపేట గ్రామాభివృద్ధికి రూ.25వేల ఆర్థిక సహాయం అందజేసిన జీపీ కో-ఆప్షన్ సభ్యుడు ఎస్కే ముస్తాక్‌ను పాలకవర్గ సభ్యులు సన్మానించారు. అబ్బాపూర్(ఎం)లో ఎంపీపీ సంగెం శ్రీనివాస్ పాల్గొన్నారు. బోధన్‌లో పారిశుద్ధ్య కార్మికులను బల్దియా చైర్పర్సన్ తూము పద్మావతి శాలువా కప్పి సన్మానించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ భైరి శంకర్, కౌన్సిలర్ తూము శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలంలోని సాలూరా గ్రామానికి బాడీ ఫ్రీజర్‌ను అందజేసిన దాత దీక్షిత్ గ్యాస్ యజమాని ఆదినారాయణను ఎంపీపీ బుద్దె సావిత్రీరాజేశ్వర్ సన్మానించారు. పల్లెప్రగతితో కందకుర్తి గ్రామంలో దేశంలోనే అభివృద్ధిలో 20వ స్థానంలో నిలిచిందని రెంజల్ ఎంపీడీవో శంకర్ అన్నారు. పల్లెప్రగతి ముగింపు సందర్భంగా గ్రామ ప్రత్యేకాధికారులు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.
ఉప సర్పంచ్ యోగేశ్, నీలా విండో చైర్మన్ ఇమ్రాన్బేగ్, ఎంపీవో గౌసొద్దీన్, కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు. మెండోరా మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులను ఎంపీపీ బురుకల సుకన్యా కమలాకర్, జడ్పీటీసీ తలారి గంగాధర్, సర్పంచులు, పాలకవర్గ సభ్యులు సన్మానించారు. ధర్పల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అందరి సహకారంతో పల్లెప్రగతిని విజయవతం చేశామని సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్ పేర్కొన్నారు. సిరికొండ మండలం పోత్నూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ మలావత్ సంగీతారాజేందర్ పాల్గొన్నారు. జీపీ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. జక్రాన్ఫల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలను పాలకవర్గ సభ్యులు సన్మానించారు. కోటగిరి మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ప్రత్యేకాధికారులు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.
రుద్రూర్ గ్రామపంచాయతీకి బాడీ ఫ్రీజర్‌ను అందజేసిన లయన్స్‌క్లబ్ ఆఫ్ వర్ని సభ్యుడు కోటేశ్వర్‌రావును సర్పంచ్ చంద్రశేఖర్ సన్మానించారు. వర్ని మండలం సత్యనారాయణపురం, మల్లారం, జాకోరా, జలాల్పూర్ తదితర గ్రామాల అభివృద్దికి సహకరించిన, విరాళాలు అందించిన దాతలను గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. సత్యనారాయణపురం గ్రామ పంచాయతీకి విరాళాలు అందించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులతోపాటు, వర్ని ఎస్ఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, గ్రామ పెద్దలు నేమాని వీర్రాజు, అనిల్ కుమార్, మార్ని విశ్వనాథం, గారపాటి సత్యనారాయణ, చిక్కల సుబ్రహ్మణ్యం, అనంత జనార్దన్ తదితరులను సర్పంచ్ నేమాని నాగమణి, ఉప సర్పంచ్ కంది కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సాయిలు తదితరులు ఘనంగా సన్మానించారు. చందూర్ గ్రామానికి వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్, హెల్త్ సెంటర్‌కు ఫర్నిచర్‌ను అందజేసిన దాతలను సన్మానించారు. ప్రత్యేకాధికారి రమేశ్, వైస్ ఎంపీపీ దశాగౌడ్, ఎంపీడీవో నీలావతి, ఎంపీవో తారాచంద్, సర్పంచ్ సాయారెడ్డి, ఆర్ ఐ నజీర్, కార్యదర్శి సాయిలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.