జక్రాన్పల్లి, జూన్ 16: సాధారణ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న చిన్ని కృష్ణుడికి మరో అరుదైన గౌవరం దక్కింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రాష్ట్రీయ యువక్ పరిషత్ సంస్థ గోల్డెన్ జూబ్లీ మహోత్సవంలో భాగంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతు, ఆర్మీ రిటైర్డ్ చీఫ్, కరోనా సమయంలో సేవలు అందించిన అంబులెన్స్ డ్రైవర్, సామాజిక సేవ చేసిన వారు ఇలా ఐదుగురిని ఎంపిక చేశారు. హైదరాబాద్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వీరికి అవార్డుల ను రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో తనకు అవార్డు లభించినట్లు చిన్నికృష్ణుడు తెలిపారు. చిన్ని కృష్ణుడు ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ మండంలోని గూపన్పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామం జక్రాన్పల్లి మండలంలోని చింతలూర్ గ్రామం. చిన్నికృష్ణుడికి అవార్డు రావడంతో చింతలూర్ గ్రామస్తులతోపాటు ఎంపీపీ విమలారాజు, జడ్పీటీసీ తనూజరెడ్డి, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఏవో దేవిక, సర్పంచులు, ఎంపీటీసీలు హర్షం వ్యక్తం చేశారు.