నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 16: పల్లెప్రగతి జిల్లాలో ఉత్సాహంగా కొసాగుతున్నది. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేస్తూ వివిధ పనులు చేపడుతున్నారు.పల్లెప్రగతిలో గ్రామాలకు మహర్దశ ఏర్పడుతున్నదని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో గురువారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటి నీరు పోశారు. ‘ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.27లక్షలతో ఉన్నత పాఠశాలలో, రూ.ఏడు లక్షలతో ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు. గ్రామంలో సోక్ పిట్స్ పనులను ప్రారంభించారు. సర్పం హ దారం ప్రవీణ్, చిన్నారెడ్డి, ఎంపీటీసీ సత్తెమ్మ రవి, ఎంపీవో శ్రీనివాస్, నాయకులు బేగరి రవి, అంజయ్య, మనోహర్రావు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో అధికారులు పల్లెనిద్ర చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టారు.