నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 14 : అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్ ఈ నెల 16వ తేదీన నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలుకనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తెన్న తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ర్యాలీ, సన్మాన సభ ఏర్పా టు చేసినట్లు తెలిపారు. క్రీడా సంఘాల సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10 గంటలకు పూలాంగ్ చౌరస్తా నుంచి కలెక్టర్ గ్రౌండ్, న్యూ అంబేద్కర భవన్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. 11 గంటలకు న్యూఅంబేద్కర్ భవన్లో సన్మాన సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.