యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ దగా
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇటీవల ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధే కారణమని ఆమెపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
- నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన ప్రియాంక గాంధీని విచారణకు పిలువండి
- ఎన్హెచ్ఆర్సీకి బక్కా జడ్సన్ ఫిర్యాదు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇటీవల ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధే కారణమని ఆమెపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రియాంకాగాంధీకి నోటీసులు పంపి, విచారణకు పిలువాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం చెందడమే కాకుండా.. యువత జీవించే, జీవనోపాధి పొందే హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ వివరాలు, నిరుద్యోగ భృతి చెల్లింపుల స్థితి, పారదర్శకంగా వార్షిక జాబ్ క్యాలెండర్ అమలు, మరణించిన యువతకు ఆర్థికసాయం, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ డైరీ నంబర్ 4042/ఎన్/ 2026ను కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించింది. యువ సంఘర్ష్ సభ పేరిట సరూర్‌నగర్ స్టేడియంలో డిక్లరేషన్‌ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆలిండియా ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంకగాంధీ 2023 మే 8న నిర్వహించిన ఈ సభకు హాజరయ్యి, డిక్లరేషన్‌ను విడుదల చేశారు.
హామీనిచ్చి.. అమలుచేయనివి
- మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ.
- ఏటా జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటన, సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తి.
- నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెలా రూ. 4వేల నిరుద్యోగ భృతి చెల్లింపు.
- నిరుద్యోగ నిర్మూలనకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు. ఏడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పడం.
- ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో యువతకు 75శాతం రిజర్వేషన్ల కల్పన.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

