భీమ్‌గల్, జూన్ 14: తమ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.69కోట్లతో చెక్డ్యామును మంజూరు చేయడం సంతోషంగా ఉన్నదని భీమ్‌గల్ మండలం బెజ్జొరా రైతులు అన్నారు. ఈమేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి చిత్ర పటానికి వారు మంగళవారం క్షీరాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో రైతులు సుమన్, నర్సయ్య, గంగాధర్, రెడ్డి, గంగారాం తదితరులు పాల్గొన్నారు.