డిచ్పల్లి, జూన్ 14: మహిళా సంఘాల కృషితోనే డీఆర్డీఏకు రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం లభించిందని డీఆర్డీవో చందర్‌నాయక్ అన్నారు. డిచ్పల్లిలోని సాంకేతిక శిక్షణా అభివృద్ధి కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా మహిళా సహకార సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం సాధించడంతో ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మహిళా సమాఖ్య సభ్యులను ప్రత్యేకంగా అభినందించారన్నారు.
బ్యాంకు లింకేజీ రుణాల ప్రగతి 2022-23 సంవత్సరానికి 21,788 సంఘాలకు రూ.1032.69 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి స్త్రీనిధిలో రూ.236కోట్లకు రూ.21కోట్లు ప్రగతి సాధించామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. బీ గ్రేడ్‌లో ఉన్న సంఘాలను ఏ గ్రేడ్‌లోకి తెచ్చేందుకు మండల సమాఖ్యలు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీఎం శ్రీనివాస్, నీలిమా, మారుతి, ఏపీఎం సరోజినీ, అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి రాధ, కోశాధికారి కల్పన సిబ్బంది పాల్గొన్నారు.