నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 11 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంపీపీ లక్ష్మీబాయి శ్రమదానం చేశారు. మద్నూర్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో శ్రమదానం చేశారు. ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామాన్ని సైతం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌పటేల్, శివ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని దావల్మల్కపల్లి గ్రామంలో కొనసాగుతున్న పల్లెప్రగతి పనుల్లో ఎంపీవో ప్రకాశ్ పాల్గొని రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం పల్లెప్రకృతి వనంలో పిచ్చిమొక్కలను సిబ్బందితో కలిసి తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి సుజాత, గ్రామ ప్రత్యేకాధికారి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గాంధారిలో సర్పంచ్ మమ్మాయి సంజీవ్ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మురికి కాలువలతోపాటు రోడ్లపై ఉన్న చెత్తను తొలగించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
నాగిరెడ్డిపేట్ మండలం జలాల్పూర్, అచ్చయిపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌రెడ్డి, ఎంపీపీ రాజదాస్, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచులు కృష్ణ, శైలజ పల్లెప్రగతిలో పాల్గొని వీధులను శుభ్రం చేశారు.
రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్, గొల్లపల్లి, గోకుల్‌తండా తదితర గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు రహదారులు, డ్రైనేజీలు, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించారు.
లింగంపేట మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సర్పంచ్ అనిల్‌రెడ్డి గ్రామంలోని పలు వార్డుల్లో రోడ్లను శుభ్రం చేయించడంతోపాటు మురికి కాలువల్లో పూడికను తీయించారు.
సదాశివనగర్తోపాటు 24 గ్రామ పంచాయతీల్లో అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆశ, అంగన్ వాడీ వర్కర్లు, గ్రామస్తులు, జీపీ సిబ్బంది వీధుల్లో ఉన్న చెత్తను తొలగించారు. సదాశివనగర్‌లో సర్పంచ్ బద్దం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది ట్రాక్టర్‌తో ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కలం రాజ్వీర్, ఎంపీవో సురేందర్‌రెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారులు ఏపీఎం రాజిరెడ్డి, అబ్బ లింగం, గొర్రె రాములు, సౌజన్య, కృష్ణాంజలి, ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలంలోని మాగి, మహ్మద్‌నగర్, మల్లూర్‌లో సర్పంచులు శ్రమదానం చేశారు. ప్రధాన రహదారులను శుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పిట్లం మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్లంలో సర్పంచ్ విజయలక్ష్మి, చిన్నకొడప్గల్ లో సర్పంచ్ కవిత, రాంపూర్‌లో సర్పంచ్ నారాయణరెడ్డి గ్రామాల్లోని రహదారులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి అధికారులు, ఉప సర్పంచులు ఇబ్రహీం, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూర్ మండలంలోని కాచాపూర్, తిప్పాపూర్, బస్వాపూర్ గ్రామాల్లోని పాఠశాల ప్రాంగణాలు, గ్రామంలో ప్రజాప్రతినిధులు శ్రమదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గాల్‌రెడ్డి, సర్పంచ్ సులోచన, మాజీ ఎంపీపీ సుదర్శన్, ఉప సర్పంచ్ సిద్ధాగౌడ్ పాల్గొన్నారు. తిప్పాపూర్ లో సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ సాయిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింహులు, స్పెషల్ ఆఫీసర్ వెంకట్రాజంగౌడ్, సెక్రటరీ నరేందర్‌రెడ్డి, బస్వాపూర్‌లో సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ భిక్షపతి, ఎంపీటీసీ లీలావతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, సింగిల్ విండో వైస్ చైర్మన్ స్వామి, మాజీ సర్పంచ్ పద్మ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిద్ధిరాంరెడ్డి తదితరులు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీబీపేట్ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. బీబీపేట, మాందాపూర్, మాల్కాపూర్, యాడారం, తుజాల్పూర్ తదితర గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పల్లెప్రగతి పనులు చేశారు. మండల కేంద్రంలో సర్పంచ్ తేలు లక్ష్మీసత్యనారాయణ, ఎంపీవో కృష్ణ, ఎంపీటీసీ కొరివి నీరజా నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామస్తులు బస్టాండ్ ఆవరణలో శ్రమదానం చేశారు. మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్ రాంరెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానంలో భాగంగా పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో సర్పంచ్ చింతల రవితేజాగౌడ్, ఎంపీడీవో నాగేశ్వర్రావు, ఎంపీవో మల్హరీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఇంటి పరిసరాలు, వార్డు, గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. మండలంలోని కొటాల్పల్లి, లింగాయపల్లి, తిమ్మక్‌పల్లి తదితర గ్రామా ల్లో శ్రమదానం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
బీర్కూర్ మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలో పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామం శుభ్రంగా మారిందన్నారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.