ఆర్మూర్/వేల్పూర్, జూన్6: ఆర్మూర్ మండలంలోని 18 గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన చెక్కులను సోమవారం ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎంసి.గంగారెడ్డి, ఎంపీటీసీలు సామెర సురేశ్, మంగ్లారం మహేందర్, హన్మాండ్లు, సర్పంచ్లు సింగిరెడ్డి మోహన్, బంటు దయానంద్, కొత్తపల్లి లక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన చెక్కులను జడ్పీటీసీ భారతి మండల కేంద్రంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో నలుగురికి కిరాణా షాపుల ఏర్పాటుకు రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమ జమునా రాజేందర్, వైస్ ఎంపీపీ బొజపల్లి సురేశ్, ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగేందర్, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచులు, ఎంపీడీవో, ఎంపీవో తదితరులు పాల్గొన్నారు.