మాక్లూర్/ ఎడపల్లి/ కమ్మర్పల్లి/ బోధన్ రూరల్/ వేల్పూర్/ మెండోరా/ బాల్కొండ/ రుద్రూర్/ మోర్తాడ్, జూన్ 5: ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మాక్లూర్‌లో ఆదివారం నిర్వహించిన పల్లెప్రగతిలో ఆయన పాల్గొని మొక్కను నాటారు. డీపీవో జయసుధ, సర్పంచ్ అశోక్‌రావు, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణారావు, ఉపసర్పంచ్ అనితా సాయిలు, కో-ఆప్షన్ సభ్యుడు హైమద్, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీచైర్మన్ మానిక్‌బండార్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ టెట్‌ను పరిశీలించి అభ్యర్థులతో మాట్లాడారు.
ఎడపల్లి మండల ప్రత్యేకాధికారి అశోక్, ఎంపీపీ శ్రీనివాస్ అంబం గ్రామాన్ని సందర్శించారు. తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వారితో సర్పంచ్ గంగాప్రసాద్ ఉన్నారు.
కమ్మర్పల్లి మండలంలో తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
బోధన్ మండలంలోని పలు గ్రామాలను ఎంపీడీవో మధుకర్ సందర్శించి ప్రజలు గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
వేల్పూర్ మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మెండోరా మండల కేంద్రంలో ప్రత్యేకాధికారి సాయాగౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ మచ్చర్ల లక్ష్మి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.
బాల్కొండ మండలంలోని చిట్టాపూర్‌లో మండల ప్రత్యేకాధికారి గంగాధర్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, సర్పంచ్ రాజేందర్ మురికి కాలువలు, వీధులను పరిశీలించారు.
రుద్రూర్ మండలంలోని సులేమాన్‌నగర్‌లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను సర్పంచ్ ఖాదర్ పరిశీలించారు. మోర్తాడ్‌లో సర్పంచ్ బోగ ధరణి, ఉపసర్పంచ్ గంగారెడ్డి, కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు.