తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేలా పంటల్ని సాగు చేస్తున్నారీ రైతులు. నెలలపాటు దిగుబడి కోసం వేచిచూడకుండా ఇతర పంటలపై దృష్టిసారిస్తూ లాభాలు పొందుతున్నారు. సాగు చేసిన నెల, రెండు నెలల నుంచి దిగుబడులు మొదలై ఆశించిన ఫలితాలు వస్తుండడంతో పలువురు రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువగా ఉన్న ఈ పంటలతో నష్టం అనేదే లేదని చెబుతున్నారు ఈ రైతులు. రోజూ వారీగా ఆదాయం పొందుతూ మూడు పువ్వులు.. ఆరుకాయలుగా లాభాలు సాధిస్తున్న కూరగాయల సాగు రైతులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..