ఖలీల్‌వాడి, మే 27 : నిజామాబాద్‌కు చెందిన ముగ్గురు ఆడబిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభకనబర్చడం రాష్ర్టానికే గర్వకారణమని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్‌కు చేరుకున్న నిఖత్ జరీన్, ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఈషా సింగ్, ఇండియన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి సౌమ్య గుగులోత్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ స్వాగతం పలికారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు తెలంగాణకు గర్వకారణమన్నారు.