బాన్సువాడ రూరల్, మే 27: బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మం జూరు చేస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికీ గూడు కల్పించడమే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నా రు. మండలంలోని బోర్లం గ్రామంలో బీడీ కార్మికులకు శుక్రవారం ఇండ్ల స్థలాల కేటాయింపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పోచారం భాస్కర్‌రెడ్డి.. ఆర్డీవో రాజాగౌడ్ సమక్షంలో బీడీ కార్మికులకు లక్కీ డ్రా పద్ధతిలో ఇండ్ల స్థలాలను కేటాయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ ఆదేశాలతో అర్హులైన 64మంది కార్మికులకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తున్నామన్నారు. ఇండ్ల స్థలాల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరుగకుండా, పారదర్శకంగా లక్కీడ్రా పద్ధతిలో కేటాయించామని తెలిపారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనే గొప్పసంకల్పంతో డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తూ వారిపేరునే ఇండ్లు మంజూరు చేసున్నారని తెలిపారు. ఇండ్ల స్థలాలు పొందిన వారందరూ సకాలంలో ఇండ్లు నిర్మించుకొని గృహప్రవేశాలు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, ఎంపీపీ దొడ్ల నీరజ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, సర్పంచ్ సరళ, ఎంపీటీసీ శ్రావణి, ఆత్మ కమిటీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, బుడిమి సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, రెడ్‌క్రాస్ సొసైటీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాజ్, దేవేందర్‌రెడ్డి, గోపన్‌పల్లి సాయిలు, హైమద్, మన్నె చిన్న సాయిలు, మహబూబ్, సులేమాన్, నిస్సార్, మన్నెచిన్న విఠల్, మెహరాజ్, పుట్టి శేఖర్, మంద సాయిలు తదితరులు పాల్గొన్నారు.