కమ్మర్పల్లి/మోర్తాడ్/బాల్కొండ, మే 27: పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా లబ్ధిపొందుతున్న రైతులు ఈ 31లోగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ మండలాల్లో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్‌లో ఈ-కేవైసీ నమోదుపై రైతులకు ఏడీఏ మల్లయ్య అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు పీఎం కిసాన్ డబ్బులు పొందిన ప్రతిరైతు తమ ఫోన్లోనే ఈ-కేవైసీ చేసుకోవచ్చని చెప్పారు. ఆధార్ నంబర్‌తో ఫోన్ నంబర్ అనుసంధానం లేకపోతే మీసేవ కేంద్రంలో వేలుముద్ర వేసి ఈకేవైసీ చేయించుకోవచ్చని చెప్పారు. ఈ-కేవైసీ చేయించడానికి ఈనెల 31 వరకు గడువు ఉందని, ఈ-కేవైసీ చేయించిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆయన వెంట ఏవో లావణ్య, ఏఈవో రంజిత్ ఉన్నారు.
బషీరాబాద్‌లో..
కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్‌లోని జీపీఈ కార్యాలయ ఆవరణలో రైతులకు ఏఈవో పద్మ అవగాహన కల్పించారు. ఈనెల 31లోగా ఈ-కేవైసీ నమోదు చేసుకుని పీఎం కిసాన్ నిధులను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సక్కారాం అశోక్, వార్డు సభ్యులు సాగర్, పోశన్న, గణేశ్, వీడీసీ అధ్యక్షుడు ముఖేశ్ ఎల్.దేవేందర్, డాక్టర్ మురళి, నాయకులు ఎన్.రమేశ్, ఎస్.నారాయణ, భూమేశ్వర్, ఎ.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్, బి.రాజు, ఎస్.శేఖర్, బాశెట్టి, శేఖర్, యూసుఫ్, నారాయణ పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ఈ-కేవైసీ నమోదును మండల వ్యవసాయాధికారి మహేందర్‌రెడ్డి పరిశీలించి మాట్లాడారు. 11వ విడుత పీఎం కిసాన్ నిధులు మంజూరు కావాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. రైతులు మీసేవా సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్లలో గానీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారు సొంతంగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఆయన వెట ఏఈవో కృష్ణవేణి, వీడీసీ సభ్యులు ఉన్నారు.