బాన్సువాడ టౌన్/కోటగిరి, ఫిబ్రవరి 27: పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమా జం నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయ న బాన్సువాడలోని వందపడకల మాతాశిశు దవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పుట్టిన పసిపాప నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలను పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి, ఆరోగ్యవంతమైన జీవితం కోసం చుక్కల మందు వేయించాలన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఇందుకోసం గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు , పౌష్టికాహారం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. బాన్సువాడ పట్టణంలో రూ. 20 కోట్లతో మాతా-శిశు దవాఖాన, అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం బ్లడ్ బ్యాంక్‌ను నిర్మించామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాస్, కో-ఆప్షన్ సభ్యులు బాబా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి మండలం తిర్మలాపూర్క్యాంప్ అంగన్వా డీ కేంద్రం ఆవరణలో చిన్నారులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చుక్కల మందు వేశారు. ఎలాంటి అపోహలు లేకుండా ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. సర్పంచ్ ఎజాజ్‌ఖాన్, జడ్పీటీసీ శంకర్‌పటేల్, వల్లెపల్లి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గంగాధర్‌పటేల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.