మోర్తాడ్, జనవరి27: సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసానిస్తుందని రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవన్న, సర్పంచ్ పర్సదేవన్న అన్నారు. గురువారం దోన్పాల్ గ్రామంలో అదే గ్రామానికి చెందిన లావణ్యకు రూ.40వేలు, ప్రవీణ్‌కు రూ.29వేలు, సుంకరి లావణ్యకు రూ.35వేలు మంజూరు కాగా.. చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ అందిస్తూ ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, నర్సాగౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముత్యాల లక్ష్మణ్, పర్సగంగన్న, లింగన్న తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్‌పల్లిలో ..
కమ్మర్పల్లి, జనవరి 27 : మండల కేంద్రానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థికసాయం మంజూరవగా.. చెక్కులను బాధితులకు సర్పంచ్ గడ్డం స్వామి గురువారం అందజేశారు. గ్రామానికి చెందిన జె.చందన్‌కు రూ.35 వేలు, మౌనికకు రూ.30 వేలు, సీహెచ్.పద్మకు రూ.30 వేలు, బి.శివ కృష్ణకు రూ.30 వేలు, జె.గంగాధర్‌కు రూ.75 వేలు మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాలెపు గంగారాం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చింత గణేశ్, రెంజర్ల మహేందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలో..
వేల్పూర్, జనవరి 26: మండలంలోని అక్లూర్,కొత్తపలి గ్రామాల్లో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీఆర్ఎస్ నాయకులు గురువారం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నాగధర్,కొత్తపల్లి సర్పంచ్ నితీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలంలో..
భీమ్‌గల్,జనవరి 27: భీమ్‌గల్ మండలంలోని పురాణీపేట్, బాబాపూర్, మెండోరా గ్రామాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జడ్పీటీసీ చౌట్పల్లి రవి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, సర్పంచులు తోట శంకర్, అతిక్,రాజేందర్, ఎంపీటీసీలు సాయి ప్రసన్న, ఆరె లావణ్య తదితరులు పాల్గొన్నారు.