ఆర్మూర్, మే 20 : పట్టణం, మండల పరిధిలోని పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల రాము అన్న, మాజీ ఉపసర్పంచ్ గంగారాం, మిర్ధాపల్లిలో సజ్జల భూమారెడ్డి, పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పోల సుధాకర్ తల్లి ఇటీవల మృతిచెందగా, వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకున్న ఆలూర్ ఎంపీటీసీ మర్కంటి లక్ష్మీ మల్లేశ్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి చెందిన ఎమ్మెల్యే బావ మరిది యాల్ల నరేందర్ అమ్మమ్మ మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, కౌన్సిలర్ బండారి ప్రసాద్, కౌన్సిలర్ సుజాతా రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నరేందర్, నాయకులు మేదరి నరేశ్, సుంకరి రవి, సర్పంచ్ కల్లెం మోహన్, మధువర్మ, మాజీ ఎంపీటీసీ సాయారెడ్డి ఉన్నారు.