ధర్పల్లి, మే 19 : మాయమాటలు చెబుతూ కాలం వెళ్లదీసే బీజేపీ నాయకులను నమ్మి మోసపోవద్దని, అభివృద్ధికి కట్టుబడి పనిచేసే టీఆర్ఎస్ నాయకులను ఆదరించాలని జిల్లా పరిషత్ ప్రణాళిక సంఘం సభ్యుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని ప్రాజెక్టు రామడ్గులో రూ.50లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్అండ్బీ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డితో కలిసి జగన్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభివృద్ధి కోసం ఆరాటపడే వ్యక్తి అని, ఆయన నాయకత్వంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామని అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, అలాంటి ఉన్నతమైన వ్యక్తిని విమర్శించే హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రగల్భాలు మాని వారు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుపాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె.నవీన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మయ్యగారి రాజేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.